న్యూ డిల్లీ : రాజధానిలో కరోనా కేసులు పెరిగిపోతున్నందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం (ఈ రోజు) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం (ఈ నెల 26) ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. ‘ఇది చిన్నపాటి లాక్డౌన్ మాత్రమే. వలస కార్మికులు ఎవ్వరూ ఢిల్లీ నుంచి వెళ్లకూడద’ని కోరారు. ‘మేము లాక్డౌన్ను ఆరు రోజులు మాత్రమే కొనసాగిస్తాం. పొడిగింపు అవకాశాలేవీ ఉండబోవు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల బాగో గులను ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవధిలో ఇక్కడి ఆసుపత్రుల్లో కరోనా బెడ్లను పెంచడం, ఆక్సిజన్ సమకూర్చడం వంటి అన్ని చర్యలు తీసుకుంటాం. కరోనా కేసులు పెరిగిపోతున్నందున నేపథ్యంలోనే లాక్డౌన్ విధించాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల’ని వివరించారు.