పాట్నా:ఢిల్లీ హస్త కళా ప్రదర్శనలో ప్రధాని మోదీ తిన్న’లిట్టి చోఖా’ బీహారు ప్రభుత్వంలో భాగస్వామి భాజపా-పక్షం ఆర్జేడీ మధ్య ‘చిచ్చు’ రేపింది.‘మీరు మా ప్రత్యేక వంటకం లిట్టీ చోఖా తినొచ్చు. కానీ మీరు మాకు చేసిన ద్రోహాన్ని బిహార్ ఎప్పటికీ మర్చిపోద’ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేసారు.‘బిహార్ కు చెందిన ప్రత్యేక వంటకాన్ని ఇష్టపడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. బిహార్ ముఖ్య మంత్రి రాష్ట్రా న్ని, రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలను పట్టించు కోవడం లేదు. మిమ్మల్ని అడగడం లేదు కూడా. అందువల్ల మీరు ఇచ్చిన హామీల మేర కు బిహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక నిధులు, వరద సహాయక నిధులు, ఆయుష్మాన్ భారత్కు నిధులు ఇవ్వడంపై దృష్టి సారిస్తారని భావి స్తున్నా’మని ట్వీట్ చేసారు.‘ఢిల్లీలో మోదీ లిట్టి చోఖా తింటే ఇక్కడ బిహార్ లో కొందరికి కడుపు మండుతోంది.బిహార్ వంటకాన్నే కాదు, రైతుల ఆదాయం పెంచే అంశంపై గురించి సమా వేశాన్ని కూడా నిర్వహించామ’ని భాజపా అధ్యక్షుడు, ఉప ముఖ్య మంత్రి సుశీల్ మోదీ ప్రతి స్పందించారు.