దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్!

దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నట్లు సమాచారం.ముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LEPL) దివాలా దిశగా పయనిస్తోందని తెలుస్తోంది.లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉందని రుణదాతల నుంచి తీసుకున్న రుణాలను ప్రస్తుతం తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేదని లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ మేరకు నోటిఫికేషన్ను కూడా మీడియాకు విడుదల చేసింది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎంఎస్ మనో రంజని పేరుతో నోటిఫికేష్ విడుదల చేశారు.దివాలా తీయడంతో తర్వాత జరగాల్సిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమై మే 12, 2020 నాటికల్లా ముగుస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. క్రమంలో లింగమనేని ఎస్టేట్స్కు రుణాలు ఇచ్చిన రుణదాతలంలా నవంబర్ 29లోగా తగిన ఆధారాలు డాక్యుమెంట్లు తీసుకుని బోర్డు ముందుకు హాజరుకావాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos