న్యూ ఢిల్లీ: ఫించను దార్లు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే గడువును కేంద్రం మరో రెండు నెలలు పొడిగించింది. దీని ప్రకారం 2021 ఫిబ్రవరి 28 లోగా జీవన ప్రమాణ పత్రాల్ని దాఖలు చేయవచ్చు. కరోనా కారణంగా లైఫ్ సర్టిఫికేట్ దాఖలు గడువును పెంచాలని ఫించను దార్ల సంఘాల చేసిన వినతులకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వ అధీన కార్యదర్శి రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ ఏటా పింఛనుదారులు నవంబర్లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది.