మోదీకి చేదు అనుభవం

మోదీకి చేదు అనుభవం

మణిపూర్: రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఉపయోగించు కోవాలని చూడొద్దని ‘గ్రెటా థన్బర్గ్ ఆఫ్ ఇండియా’గా పేరు గాంచిన లిసీ ప్రియా కంగుజం (8) ప్రధాని నరేంద్రమోదీని కోరింది. వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పించడానికి కంకణం కట్టుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా తనను ప్రశంసించి మోదీ చేసిన ట్వీట్ కు ఆ మేరకు ఘాటుగా స్పందించింది. సాధారణంగా ప్రధానిమెచ్చుకుంటే ఎవరైనా సంబరపడిపోయి థ్యాంక్స్ చెబుతారు.లిసీప్రియా వైఖరి అందుకు పూర్తి విరుద్దం.‘ రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఉపయో గించు కోవాలని చూడొద్దని కోరింది. మోదీకి అనుకూలంగా తాను పనిచేయలేనని పేర్కొంది.‘మాటలకే మోదీ పరిమితం.ఈ విధానాలను లిసీప్రియా కంగుజం తిరస్కరించింద’ని కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది.‘నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రశంసిస్తున్నా.నా పట్ల కాంగ్రెస్ సానుభూతి ప్రదర్శించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎందరు కాంగ్రెస్ నేతలు నాడిమాండ్లను వినిపిస్తున్నార’ని ప్రశ్నించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos