ఉగ్రవాది నిస్సార్ నిర్బంధం

ఉగ్రవాది నిస్సార్ నిర్బంధం

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాది నిస్సార్ అహ్మద్ దార్ ను ఎట్టకేలకు భద్రతా దళాలు శ్రీనగర్లో శనివారం బంధించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఇక్కడ తెలిపారు. హాజిన్లోని వహాబ్ పార్రే మొహల్లాకి చెందిన 23 నిస్సార్ గత కొన్నేళ్లుగా అతడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. 2016లో ఏడు కేసులు, నిరుటి ఒక కేసు సహా మొత్తం ఎనిమిది కేసు ల్లో తను నిందితుడు. జమ్మూ కశ్మీర్ ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద అతడిని గతంలో రెండు సార్లు అదుపులోకి తీసుకు న్నారు. లష్కరే తోయిబా ముఖ్యనాయకుడు సలీం పార్రేకి అత్యంత సన్నిహితుడిగా నిస్సార్కు పేరుంది. ‘‘ఉత్తర కశ్మీర్లోని లష్క రే తోయిబా టాప్ టెర్రరిస్టు సలీం పార్రేకి దార్ అత్యంత సన్నిహితుడు. గత నవంబర్ లో కులాన్ గందర్బాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్ ఉగ్రవాది ఒకరు మరణించాడు. అప్పుడు నిసార్ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి నిసార్ కోసం గాలింపులు చేపట్టారు. శ్రీనగర్లో తలదాచుకున్నట్టు గుర్తించి సజీవంగా అదుపులోకి తీసు కు న్నాం. నిస్సార్ వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos