విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞ దినం

విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞ దినం

విజయనగరం : బషీరాబాగ్ కాల్పులో అశువులు బాసిన అమర వీరులు స్పూర్తితో నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వామపక్షాల ప్రతిజ్ఞ పూనాయి. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాలు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి. రమణ, సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ నాయకులు బెహరా శంకరరావు లు మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే పెద్ద ఎత్తున పోరాటం చేయడం కారణంగా ఆ నాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులతో కాల్పులు జరిపి ముగ్గురు మరణానికి కారణం అయ్యారన్నారు. ఇదే రోజున ఆగస్టు 28 న అమరులైన వారి స్పూర్తితో నేడు కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు,స్మార్ట్ మీటర్లు పెట్టీ ప్రజలు నేత్తిన భారాలు వేస్తున్నారన్నారు. ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో 50 వేల కోట్లు రూపాయిలు ప్రజలపై భారాలు వేయడం జరిగిందన్నారు. నేడు మరల అదే విధంగా భారాలు వేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేసిన మంత్రి లోకేశ్ నేడు స్మార్ట్ మీటర్లు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేవలం ఓట్లు కోసం, అధికారం కోసం ప్రజలను మోసం చేశారన్నారు. ఏదైతే విద్యుత్ పోరాటం ఆ నాడు జరిగిందో అదే స్పూర్తితో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. తక్షణమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారాలు తగ్గించాలని,స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల మరో బషీరాబాగ్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి , శంకరరావు, టి వి రమణ,పి.రమణమ్మ, ఏ.జగన్మోహనరావు, సి హెచ్ వెంకటేష్, సిపిఐ నాయకులు బుగత అశోక్, రంగరాజు, బాయి రమణమ్మ, లిబరేషన్ పార్టీ నాయకులు అప్పలరాజు వామపక్షాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos