లెబనాన్: గత ఏడాది అక్టోబర్ 8 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల కారణంగా 1,873 మంది మరణించారని, 9,134 మంది గాయపడ్డారని లెబనాన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ యూనిట్ ప్రకటించింది. “ఇజ్రాయెల్ దురాక్రమణకు గురైన ప్రాంతాల నుండి వలస వెళ్లిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. అందులో 155,600 మంది ఆశ్రయాలలో నమోదు చేసుకున్నారు” అని తన నివేదికలో పేర్కొంది.గాజా, లెబనాన్‌పై దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ దాడులు చేసింది. అలాగే ఇటీవల హమాస్, హిజ్బుల్లా మరియు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నాయకుల హత్యలకు ప్రతిస్పందనగా, ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ను ఇరాన్ హెచ్చరించింది.