షరత్తులతో లాక్ డౌన్ సడలించాలి

షరత్తులతో లాక్ డౌన్ సడలించాలి

అమరావతి: కొన్ని షరతులతో లాక్ డౌన్ ను సడలించాలని ముఖ్యమంత్రి జగన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా స్థితి గతుల గురించి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘మీ నాయకత్వ లక్షణాలపై తమకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు సూచించిన వ్యూహంతోనే ముందు కెళ్తాం. .రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాం. . రాష్ట్రంలో 141 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించాము. . రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొన్ని షరత్తులతో సడలించాలి. సినిమా హాల్స్, మాల్స్, స్కూళ్లను తప్పా మిగిలిన వాటిని లాక్ డౌన్ నుంచి మినహాయించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నార’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos