బెంగళూరు : తేలికపాటి పోరాట విమానం తేజస్ ఇప్పుడు మరింత శక్తిమంతమైంది. దీనికి ఐదో తరం పైథాన్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని అమర్చి మంగళవారం జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. పైథాన్-5 మిస్సైల్ ను ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. దీని రేంజి 20 కి.మీ. మాక్ 4 వేగంతో ప్రయాణిస్తుంది. దీన్నుంచి లక్ష్యం తప్పించుకోవడం అసాధ్యం. అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్, ఇమేజ్ ఇన్ ఫ్రారెడ్ వ్యవస్థలను అమ ర్చారు. అది లక్ష్యాలను సులువుగా గుర్తించి, విధ్వంసం చేస్తుంది.