బ్రాహ్మణ కులంపై లావణ్య త్రిపాఠి ట్వీట్‌..

  • In Film
  • September 11, 2019
  • 205 Views
బ్రాహ్మణ కులంపై లావణ్య త్రిపాఠి ట్వీట్‌..

ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి బ్రాహ్మణులపై చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారి వివాదాస్పదంగా మారుతోంది.లోక్‌సభ సభాపతి ఓంబిర్లా పరుశురామ అనే నాటకానికి సంబంధించి ఫోటోలు షేర్‌ చేస్తూ “బ్రాహ్మణులు ఎప్పుడూ సమాజంలో గౌరవనీయమైన స్దానంలో ఉన్నారు. అందుకు కారణం వారు చేసిన త్యాగాలు, వగైరా. అందుకే బ్రాహ్మణ సమాజం సమాజాన్ని దిశానిర్దేశం చేసే గురు స్దానంలో ఉంది.” అని కామెంట్ చేశారు.దీనికి లావణ్య ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్థానం ఉందో నాకు అర్థం కావడంలేదు. మనం చేసే పనులు మన స్థాయిని తెలియజేస్తాయి కానీ కులం కాదు’ అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌ వైరల్‌గా మారి వివాదాస్పదం అవుతుండడంతో వెంటనే దానిని తొలగించారు. దీంతో నెటిజన్లు లావణ్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు భయపడి ట్వీట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని అడుగుతున్నారు. దీనికి తన అభిప్రాయాన్ని వెల్లడించి అనవసరంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసి వివాదంలో చిక్కుకోకూడదని ఆ ట్వీట్ తొలగించినట్లు లావణ్య బదులిచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos