న్యూ ఢిల్లీ : గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 1,718 కరోనా కేసులు నమోదయ్యాయి. 67 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పీడితుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,050కు చేరింది. మొత్తం 1,074 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కరోనా బారి నుంచి 8,324 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,915కి చేరింది. ఆ తర్వాతి స్థానాలు గుజరాత్(4,082 ) ఢిల్లీ(3,439)వి.