చెన్నై: ఇక్కడి ఆశ్రమ్ పాఠశాలను వచ్చే ఏప్రిల్‌లో తొలగించాలని నటుడు రజనీకాంత్ భార్య, శ్రీ రాఘవేంద్ర విద్యా సంఘం కార్యదర్శి లతకు ఇక్కడి హైకోర్టు గురు వారం తాఖీదుల్ని జారీ చేసింది. గిండి లో వెంకటేశ్వర్లు, పూర్ణ చంద్రరావులకు చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమ్ పేరుతో పాఠశాలను నడుపుతున్నారు. అద్దె విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. 2020 ఏప్రిల్‌లో స్థలాన్ని ఖాళీ చేయడానికి 2018, ఆగస్టు లో లత అంగీకరించారు. అయితే ఇప్పటికీ ఆశ్రమ్ పాఠశాలను అక్కడ నుంచి తొలగించ లేదు. దీంతో లత అద్దె బకాయి రూ.2 కోట్లు చెల్లించేలా, తమ స్థలంలో ఆశ్రమ్ పాఠశాలను ఖాళీ చేసేలా ఆదేశించాలని స్థలం యజమానులు హై కోర్టును ఆశ్రయించారు. 2021 ఏప్రిల్ నెలలోగా ఆశ్రమ్ పాఠ శాలలో అక్కడ నుంచి తొలగించాలని న్యాయమూర్తి సతీష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లేని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.