ధోనీకి లతా మంగేష్కర్ రిక్వెస్ట్..

  • In Sports
  • July 12, 2019
  • 156 Views

 అనూహ్యరీతిలో ప్రపంచకప్‌ టోర్నీ నుంచి భారతజట్టు నిష్కృమించిన నేపథ్యంలో భారతజట్టు మాజీ సారథి,వికెట్‌కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.కొద్ది రోజుల్లో ధోని రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో టీమిండియా అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా రాజీనామా నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ ధోనీని కోరుతున్నారు.ఈ క్రమంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కూడా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ ట్విట్టర్‌ ద్వారా ధోనీని కోరారు.నమస్కారం ధోనీ గారు.. మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు విన్నాను.. దయచేసి పని మాత్రం చేయొచ్చు.. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. రిటైర్మెంట్ అనే ఆలోచన రానివ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాఅంటూ రాసుకొచ్చారులతా మంగేష్కర్‌ చేసిన ట్వీట్ కి అభిమానుల నుండి ఎంతో మద్దతు లభిస్తోంది.మరి ధోనీ మనసులో ఏముందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos