పట్నా : ‘బిహార్ 2020 శాసన సభ ఎన్నికలే నా జీవితంలో చివరి ఎన్నికలు. ఆ తర్వాత రాజకీయ జీవితాన్ని విరమించనున్నట్లు’ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. గురువారం పూర్ణియా జిల్లాలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా’ అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు.