ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్చ్ఛేంజ్ సెన్సెక్స్ 268 పాయింట్లు, 0.72 శాతం నష్టపోయి 37, 060 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 98 పాయింట్లు, 0.89 శాతం నష్టపోయి 10,019 వద్ద ఆగాయి. హీరో మోటోకార్ప్, మారుతి సుజుకీ, ఇన్ఫో సిస్, టెక్ మహీంద్రా లాభాల్ని గడించాయి. టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, టాటా స్టీల్, ఓఎన్జీసీ నష్ట పోయాయి.