నష్టాలతో విపణి మొదలు

నష్టాలతో విపణి మొదలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల వేళకు సెన్సెక్స్ 151 పాయింట్లు కోల్పోయి 37,299 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 10,998 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 286 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్ని గడించాయి. 489 కంపెనీల షేర్లు నష్టాలను చవి చూసాయి. 28 కంపెనీల షేర్ల విలువ యథాతథంగా ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.90గా ఉంది. ఇండియా బుల్స్ హౌసింగ్, బలరామ్పూర్ చినీ, ద్వారికేశ్ షుగర్, ధాంపూర్ షుగర్, యస్బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, పవర్ గ్రిడ్, డీఆర్ఎల్, సన్ ఫార్మా లాభాలు పొందాయి. విప్రో, లక్ష్మీ విలాస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డీహెచ్ఎఫ్ఎల్, కాఫీడే, జేఎంసీ ప్రాజెక్ట్స్, పిరమాల్ ఎంటర్ ప్రైజస్, రెడింగ్టన్ తదితర కంపెనీలు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos