ల్యాప్‌ట్యాప్‌ పేలి ఉద్యోగినికి తీవ్రగాయాలు

ల్యాప్‌ట్యాప్‌ పేలి ఉద్యోగినికి తీవ్రగాయాలు

కడప : బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో లాప్ టాప్ ఉన్నట్లుండి కాలిపోయింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమతి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం లాప్టాప్కు ఛార్జింగ్ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. గది లోపల గడియ పెట్టుకుని విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడడంలో ఆలస్యమైంది. గదిలోనుంచి మంటలు రావడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పరీక్షించిన వైద్యులు ఆమెను కడప రిమ్స్కి తీసుకెళ్లాలని సూచించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos