‘వారి’ ఆచూకి చెబితే రూ.501 కానుక

‘వారి’ ఆచూకి చెబితే రూ.501 కానుక

లక్నో: గ్రేటర్ నోయిడాకు చేరువలోని సూరజ్పూర్ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గత ఏడాదిగా ఈ సమస్య పరి ష్కారానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. స్తంభాలు సరిగా లేకపోవడం వల్ల విద్యుత్తు తీగలు కిందకి వేలాడుతు న్నాయి. వాటి వల్ల ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎన్నికలపుడు ఈ సమయంలో సమస్యల్ని తీరుస్తామన్నారు. తీరా అవి ముగిసాక ప్రజాప్రతినిధులు ముఖం చాటేసారు. గత ఏడాదిగా ఈ సమస్య పరిష్కారానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు రెండు రోజులుగా సూరజ్పూర్ వాసులు నిరసన ఆందోళన చేపట్టారు. తమ శాసన సభ్యుడుతేజ్పాల్ నాగర్, లోక్సభ సభ్యుడుమహేశ్ శర్మల ఆచూకీ చెప్తే రూ. 501 బహుమానం ఇస్తామని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos