గొటబాయ రాజీనామాతో సంబరాలు చేసుకు లంక ప్రజలు

గొటబాయ రాజీనామాతో  సంబరాలు చేసుకు లంక ప్రజలు

కొలంబో: దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసినందుకు శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేసారు. సంగీతం, నర్తనలతో లంక వీధుల్లో కోలాహలం నెలకొంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమల్లో ఉన్న కర్ఫ్యూను ధిక్కరించి మరీ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. గొటా గో గామా నిరసన ప్రదేశంలో గొటబాయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరుగైన పాలన కావాలని నినాదాలతో హోరెత్తించారు. తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, అధ్యక్ష భవనాన్ని ప్రజలు ముట్టడించడంతో గొటబాయ గత వారం అధ్యక్ష భవనాన్ని విడిచి పరార య్యారు. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలను గతవారం ముట్ట డించిన నిరసనకారులువాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos