యూపీ మాదే

యూపీ మాదే

లక్నో: ‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయి. సంపూర్ణ మెజారిటీతో మా పార్టీ విజయం సాధిస్తుంది. బీజేపీకి 30 లోపు సీట్లు వస్తాయ’ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ఒక వార్తా సంస్థ ముఖాముఖిలో పేర్కొన్నారు. ‘ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు లేనప్పటికీ, యూపీలోని చిన్న పార్టీలకు మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామో వేచి చూడండి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించలేవని కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. బీజేపీకి 30 సీట్ల కంటే ఎక్కువ రావు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగానే బీజేపీ నేతలు ఓట్ల కోసం ప్రజలు వెళ్తారని, అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మహిళా భద్రత, శాంతి భద్రతలు వంటి అంశాలతో ప్రజలు బీజేపీ నేతలను నిలదీయనున్నారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. గెలుపుపై బీజేపీ పెట్టుకున్న ఆశలన్నీ నీటిమూటలుగానే మిగిలి పోనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆశ్చర్యకరమైన ఫలితాలు రానున్నాయి. ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. అన్ని పార్టీలకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ స్పష్టమైన మోజారిటీని సాధిస్తుంది. పేదలు, యువత, రైతులు ఈసారి కాంగ్రెస్ వెంటే ఉన్నారు. మహిళల భద్రత, శాంతి భద్రతలతో సహా ఇస్తున్న తొమ్మిది హామీలతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలవనుంది. ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పెను మార్పు రాబోతోంది. ఆ మార్పు పేరు ప్రియాంక గాంధీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos