ఇస్లామాబాద్: పాకిస్థాన్ సోమవారం లడాఖ్ సరిహద్దులోని స్కర్దూ వాయుసేన స్థావరానికి మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. జేఎఫ్-17 ఫైటర్లనూ కూడా తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దరిమిలా భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్థాన్ వాయుసేన కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోంది.