
అమరావతి : ప్రస్తుత ఎన్నికల వేళ…ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు భాజపా అభ్యర్థులకు పెద్ద మొత్తంలో బహుమతులు ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు లోక్‌సభఫ నియోజకవర్గాల్లో డిపాజిట్ తెచ్చుకుంటే రూ.5 లక్షలు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిపాజిట్ దక్కించుకుంటే రూ.10 లక్షలు, శాసన సభకు ఎన్నికయ్యే ప్రతి బీజేపీ అభ్యర్థికి రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తన సొంత డబ్బుతోనే ఈ బహుమతులు ఇస్తానని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విసిరిన సవాలుపై తాను చర్చకు సిద్ధమని వెల్లడించారు. రాష్ట్రంలో భాజపా కంటే ప్రజా శాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. తెదేపా 135కు తగ్గకుండా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.