టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సీజన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. మోకాలి నొప్పితో కుల్దీప్ ఇటవలే భారత్‌కు తిరిగి వచ్చాడు. యూఏఈ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ మోకాలికి గాయమైంది. ఇటీవలే ముంబైలో దీనికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.