కుల్దీప్ యాదవ్ ప్రమాదకరమైన బౌలర్

  • In Sports
  • March 11, 2019
  • 206 Views
కుల్దీప్ యాదవ్ ప్రమాదకరమైన బౌలర్

ప్రస్తుత భారత స్పిన్‌ ద్వయం కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌లు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మే ఆఖరు నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో వీరిద్దరే భారత జట్టు ప్రధాన అస్త్రాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాహల్‌తో పోల్చితే కుల్దీప్‌ ప్రమాదకరమైన బౌలర్‌ అని ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ తెలిపాడు. బంతిని గాల్లోనే టర్న్‌ చేయడం కుల్దీప్‌ ప్రధాన బలమని పేర్కొన్నాడు. చాహల్‌ ఇతనిలా బంతిని టర్న్‌ చేయలేడని చెప్పాడు. బుధవారం ఢిల్లీలో భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య చివరి వన్డే జరుగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos