హైదరాబాద్: ప్రశ్నించే వాతావరణం లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ప్రజలకు ఏదైనా మాట్లాడే, చర్చించే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజల విశ్వాసాలు, అభిప్రాయాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తనతో ఉంటే దేశభక్తుడు, ఇతరులతో ఉంటే దేశద్రోహి అనే అవాంఛనీయ, దారుణ పరిస్థితులు తలెత్తాయని ఆక్రోశించారు. ‘మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండద’ని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరమత సహనం, అందర్నీ గౌరవించే సంప్రదాయం ఉందని చెప్పారు. మత వైరుధ్యాలకు విలువ లేని పరిస్థితి దేశంలో ఉందని, మహాత్ముడినే అవమానించిన లోక్సభ సభ్యులు ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను భాజపా సమర్థించడం బాధాకరమని ఆక్రోశించారు.