రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో లేదో ఏప్రిల్ 11 తరువాత తెలుస్తుంది..

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అన్నదే ముఖ్యం
కానీ ఎలా చేరుకున్నామనే విషయం ముఖ్యం కాదనేది చాలా రంగాలకు వర్తించే సూత్రం ముఖ్యంగా
రాజకీయ నేతలకు.తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే
ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నట్లు అర్థమవుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో తెదేపాపై,చంద్రబాబుపై
ఎటువంటి విమర్శలు చేసినా చంద్రబాబుకే అనుకూలంగా మారతాయని గ్రహించిన కేటీఆర్‌ ఏపీ ఎన్నికల్లో
తమ పాత్ర గురించి మాట మార్చారు.ఏపీ రాజకీయాల్లో తాము ఎందుకు వేలు పెట్టకూడదని ప్రశ్నించిన
కేటీఆర్‌ కొద్ది రోజుల క్రితం తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదని ప్రకటించారు.అయితే
గతంలో చెప్పినట్లుగానే ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ మాత్రం తప్పకుండా ఉంటుందని
తెలిపారు.తాజా కేటీఆర్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కొన్ని ముఖ్య అంశాలు పరిశీలిస్తే..

  • ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తెరాస పాత్ర ఉండదు.కానీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల అనంతరం చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోవడం తథ్యం.
  • తెరసా పార్టీ ఏపీలో అడుగు పెట్టడం లేదు.అక్కడి విషయాల్లో తెరాస తలదూర్చదు.జగన్‌ ఫ్యాన్‌కు స్విచ్‌ ఎక్కడ ఉందో చంద్రబాబుకు తెలిస్తే చంద్రబాబు సైకిల్‌కు గాలి ఎవరు కొడుతున్నారో ప్రజలకు తెలుసు.
  • దిల్లీ రాజకీయాలలో ఎప్పుడు – ఎలా స్పందించాలో కేసీఆర్ కు తెలుసు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ – భాజపా అంటే పడని పార్టీలు చాలా ఉన్నాయి. వాటిని కూడగడతాం. ప్రజలకు ఏం అవసరమో అదే అజెండాగా ముందుకు వెళతాం.
  • పచ్చి అవకాశవాది అయిన చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చామా లేదా అనే విషయం ఏప్రిల్‌ 11 తరువాత తెలుస్తుంది..
  • పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన ఇక్కడ కూడా ప్రచారం చేసుకోవచ్చు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos