హైదరాబాదు:తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు.ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ నిలదీశారు. రాజకీయ ఉనికి కోసం ఇలా దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. తనకు బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు.