కాంగ్రెస్, బీజేపీ కలిసినా…ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు..!

వరంగల్‌ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సొంతంగా ఏ
పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయజాలదని, చివరకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా ప్రభుత్వాన్ని
ఏర్పరచలేవని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌లో గురువారం
జరిగిన లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల సందర్భంగా
ఉన్న వాతావరణం ఇప్పుడు లేదని, అప్పట్లో మోదీ ఏదో చేసేస్తారని అంతా ఊదరగొట్టారని విమర్శించారు.
ఈ అయిదేళ్లలో ఆయనకు మాటలే తప్ప చేతలు లేవని అర్థమైందన్నారు. తెలంగాణలోని 17 సీట్లకు
గాను 16 స్థానాల్లో తెరాసను గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. వరంగల్‌ స్థానంలో
అయిదు లక్షల ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం మన రైతు బంధు పథకాన్ని
కాపీ కొట్టి, అన్నదాత సుఖీభవ పేరిట ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల
ముందు పీఎం కిసాన్‌ యోజనను తెచ్చారని విమర్శించారు. నేడు తెలంగాణ యావత్తు దేశానికే
రోల్‌ మోడల్‌గా మారిందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos