గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

హైదరాబాదు: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠానికి నిరుద్యోగ రేటు చేరుకుందని, అలాగే, 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం పెరిగిందని ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలు ఉన్నాయన్నారు. , వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు చెబుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితులకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ సర్కారు అని పిలవాలా? లేక ఎన్పీఏ (నిరర్థక సంపద) ప్రభుత్వం అని పిలవాలా? అని ప్రశ్నించారు.ఎన్పీఏ అంటే (నాన్ పర్ఫార్మింగ్ అసెట్-నిరర్థక ఆస్తి) అని భక్తులకు (బీజేపీ అభిమానులకు) వివరించి చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. నిరుద్యోగ పరిస్థితులు, పెరిగిపోతోన్న నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం, తగ్గుతోన్న ఆదాయం, కొనుగోలు శక్తి వంటి అంశాలను పేర్కొన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు చేపట్టిన ఓ సర్వేలో ఆయా విషయాలు వెల్లడయ్యాయని ఆ కథనంలో చెప్పారు. ఆయా అంశాలనే ప్రస్తావించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos