హైదరాబాద్: ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు, పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంది. వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమ’ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలు గు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పినట్టైంది.