కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారంటూ ప్రచారం సాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడదోసి అధికార పగ్గాలు చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఒడిశాలోని ఓ రిసార్టుకు తరలించే ప్రయత్నంలో ఉన్నారని రాజధాని బెంగళూరులో జోరుగా ప్రచారం సాగుతోంది.