హైదరాబాదు:సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడకు తరలించారు. టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలను కించపరిచారనే అభియోగాలతో నమోదైన కేసుల్లో ఆయన్ను అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు.