శ్రీకాళహస్తి : దేవాదాయశాఖ మంత్రి పదవిని చేపట్టిన కొట్టు సత్యనారాయణకు శుక్రవారం ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. వరుస సెలవుల వల్ల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. స్వామి వారి దర్శనానికి ఏకంగా 4 గంటలకు పైగానే సమయం పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చారు. ఆయ నకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వచ్చిన విషయాన్ని గ్రహించిన భక్తులు ఒక్క సారిగా నినాదాలు అందుకున్నారు. మంత్రి గోబ్యాక్ అని నినాదాలతో హోరెత్తించారు.