తిరువనంతపురం: కొత్తమంగళంలో సెయింట్ థామస్ చర్చి ముస్లింల ప్రార్ధనకు వేదికగా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాథ్యూ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో వందలాది మంది ముస్లింలూ పాల్గొన్నారు. నిరసన ముగింపు వేళకు ముస్లింల ప్రార్థన వేళ కూడా అయింది. దీంతో పక్కనే ఉన్న చర్చి ఆవరణలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని అక్కడి సిబ్బంది తెలిపింది. దీంతో వందలాది మంది ముస్లిం నిరసనకారులు చర్చి ప్రార్థనలు నిర్వహించారు. సంబంధిత పోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం అయ్యాయి.