శ్రీధర్ రెడ్డి దాడుల జాబితాలోమరొకటి

శ్రీధర్ రెడ్డి దాడుల జాబితాలోమరొకటి

నెల్లూరు: వైకాపా శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కల్లూరి పల్లిలో తన ఇంటిపై దాడి చేసినట్లు వెంకటాచలం మహిళా ఎంపీడీవో సరళ శనివారం ఆరోపించారు.‘మా ఇంటికి వచ్చి మమ్మల్ని భయాందోళనలకు గురి చేసారు. నీటి గొట్టాల్ని ధ్వంసం చేశారు. కేబుల్ వైర్ ను తెంచేసారు. విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశార’ని వివరించారు. ఆయనకు సంబంధించిన లేఔట్ కు అనుమతులు ఇవ్వనందుకే దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉండటంతో స్టేషన్ ఎదుట ఆమె బైఠాయించారు. సీఐ లేదా ఎస్సై వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటానని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos