కూ యాప్‌ మూసివేత

కూ యాప్‌ మూసివేత

న్యూ ఢిల్లీ: ట్విట్టర్కే పోటీ ఇస్తుందేమోనని భావించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూ యాప్ శకం ముగిసింది. బుధవారం నుంచి కూ యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కూ యాప్ మూతబడిన విషయాన్ని ఆ కంపెనీ కో ఫౌండర్ రాధాకృష్ణ లింక్డ్ఇన్ ద్వారా వెల్లడించారు. కూ యాప్ విక్రయం కోసం డైలీహంట్ సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. కూ యాప్ 2019లో ప్రారంభమైంది. స్థానిక భాషలకు పెద్దపీట వేస్తూ అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా సంయుక్తంగా ఈ యాప్ను రూపొందించారు. దాదాపు పదికి పైగా భాషల్లో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు ఉద్యమ సమయంలో కూ యాప్ చాలా ప్రాచుర్యం పొందింది. రైతు ఉద్యమం సమయంలో పలు అకౌంట్లు బ్లాక్ చేసే విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నెలకొంది. అప్పుడు ట్విట్టర్కు ప్రత్యామ్నయం ఉండాలని.. కేంద్ర ప్రభుత్వం కూ యాప్ను ప్రోత్సహించింది. స్వయంగా కేంద్రమంత్రులే ఆత్మనిర్భర్ యాప్గా దీన్ని ప్రచారం చేశారు. పైగా కూ యాప్ లోగో కూడా ట్విట్టర్ పిట్టనే పోలి ఉండటం దీనికి చాలా ప్లస్ అయ్యింది. ట్విట్టర్కు బ్లూ పిట్ట లోగోగా ఉండగా.. కూ యాప్నకు ఎల్లో కలర్ బుల్లి పిట్ట లోగోగా ఉంది. ఈ బుల్లిపిట్ట కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఇది జనాల్లోకి బాగా వెళ్లింది. ఒక దశలో కూ యాప్నకు 21 లక్షల డైలీ యాక్టివ్ యూజర్లు కూడా వచ్చారు. ప్రస్తుతం కూ యాప్నకు 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. కూ యాప్నకు ఆదరణ పెరగడంతో భారత్తో పాటు నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. కానీ తమకు వచ్చిన క్రేజ్ను ఆ సంస్థ ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయింది. తక్కువ సమయంలోనే కూ యాప్నకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాదిలో లేఆఫ్స్ పేరిట ఉద్యోగాలను కూడా తీసేశారు. ఈ దేశీయ యాప్ను మళ్లీ నిలబెట్టడం కోసం డైలీహంట్తో సహా పలు కంపెనీలతో రాధాకృష్ణ, మయాంకర్ చర్చలు జరిపారు. కానీ అవేవీ సఫలం కాక పోవడంతో లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్బై చెప్పేస్తోందంటూ లింక్డ్ఇన్లో వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos