కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అటవీశాఖ మహిళ అధికారి అనితపై దాడి కేసుకు సంబంధించి 16 మంది నిందితులకు గురువారం బెయిల్ మంజూరైంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో భాగంగా అటవీశాఖాధికారులు మొక్కలు నాటేందుకు ఈ ఏడాది జూన్ 30వ తేదీన ఎఫ్‌ఆర్‌ఓ అనిత నేతృత్వంలో అటవీశాఖ అధికారులు సార్సా గ్రామానికి వెళ్లారు.ఈ క్రమంలో జేసీబీలతో భూమి చదును చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు,జిపం మాజీ చైర్మన్ కోనేరు కృష్ణ తన అనుచరులతో కలసి అక్కడికి చేరుకొని ఎఫ్‌ఆర్‌ఓ అనితతో పాటు అటవీశాఖ అధికారులపై దాడి చేశాడు.ఈ ఘటనపై అనిత ఫిర్యాదు మేరకు కోనేరు కృష్ణ సహా ఆయన అనుచరులు 38 మందిపై కేసు నమోదైంది. కేసు నమోదైన వారిలో కృష్ణతో పాటు మరో 15 మందిని రిమాండ్ తరలించారు. బెయిల్ కోసం చాలా రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు..