ఆ రోడ్లకు టోల్‌ విధించే ఆలోచన లేదు

ఆ రోడ్లకు టోల్‌ విధించే ఆలోచన లేదు

హైదరాబాద్‌: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆరు నెలలు లేదా మూడు నెలలకు వారికి చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తామని తెలిపారు. భారాస హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని చెప్పారు.  ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్‌ చేస్తున్నా రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos