మచిలీ పట్నం : ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై అరెస్టయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరయింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం కొల్లు రవీంద్రకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆయనకు వ్యతిరేకంగా 356, 506, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దరిమిలా రవీంద్రను ఆయన ఇంట్లోనే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సరైన పద్ధతి పాటించలేదని అభిప్రాయపడిన న్యాయాధికారి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.