బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.నైజ హోరాటగారర వేదిక తరఫున ఏఎం వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని వెంకటేశ్ కు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.