గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి విధానసభకు
పోటీ చేయనున్నట్లు విధానసభాపతి కోడెల శివ ప్రసాద రావు తెలిపారు. మార్చి 22న
నామపత్రాల్ని దాఖలు చేయనున్నట్లు గురువారం ఇక్కడ మాధ్యమ
ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరి దిద్దుకుంటామని
ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇచ్చారు.
సత్తెనపల్లిలో 15వేల ఓట్ల ఆధిక్యతతో
విజయాన్ని సాధించటం ఖాయమని దీమా వ్యక్తీకరించారు.