హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆచార్య కోదండరాం సంఘీ భావాన్ని ప్రకటించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఆర్టీసీ నష్టాల్లో ఉందని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ ఏడాది ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. గుత్తాదార్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ధ్వజ మెత్తారు. ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారనీ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆర్ యే కారణమన్నారు. కార్మికుల సమ్మె విజయ వంతానికి తెలంగాణ ప్రజలంతా అండగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవు తోందన్నారు. ‘ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాద’ని పేర్కొన్నారు.