పవన్ కల్యాణ్‌ ఒక బోడిలింగం

పవన్ కల్యాణ్‌ ఒక బోడిలింగం

అమరావతి: ‘శతకోటి లింగాల్లో పవన్ కల్యాణే ఒక బోడిలింగం. నేను శివలింగం వంటివాడిన’ని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్ బోడిలింగమైనందునే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని ఎద్దేవా చేసారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ ప్యాకేజ్ స్టార్. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు. నా నియోజకవర్గంలో పేకాట క్లబ్బులను ఎక్కడా నిర్వహించడం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లను మూసేస్తున్నాం. వాటిని ప్రోత్సహించడం లేదు. పవన్ కల్యాణ్ తనను తాను వకీల్ సాబ్ అనుకుంటున్నారు. జనాలు మాత్రం ఆయనను షకీలా సాబ్ గా భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు ఒక బాధ్యత గల మంత్రిగా స్పందించిన’ట్లు విపులీకరించారు.ఇటీవల గుడివాడ పర్యటనలో పవన్ కల్యాణ్ ‘శతకోటి నానీల్లో ఒక నాని’అని అంటూ ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos