అమరావతి: ‘తెదేపా కి ఎన్టీఆర్ శాపం తగిలి పతనమై పోయింది. గత ఎన్నికల్లో అది స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీపై పగ తీర్చుకోవడం ఖాయమ’ని మంత్రి కొడాలి నాని మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ఎన్టీఆర్ ను మోసం చేసిన చంద్రబాబును ఏమనాలి? చంద్రబాబుకూ శాపం తప్పకుండా తగులు తుంది. ఎన్టీఆర్ శాపం తగిలే నారా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయాడు. చంద్రబాబు వయసు 73. సరిగ్గా నిలుచోలేని, కూర్చోలేని వ్యక్తి తెదేపాను పరుగులు తీయిస్తాడా? వెన్నుపోటు పొడిచేదీ మీరే… పార్టీని లాక్కునేదీ మీరే… మళ్లీ ఎన్టీఆర్ ఫొటోలకు దండలు వేసేదీ మీరే. అసలు, ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఎందుకు పంపారో చెప్పాల’ని డి మాండు చేసారు.