విజయవాడ: ‘రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తారక్ తో అమిత్ షా కలిసి ఉంటార’ని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి మోదీ, అమిత్ షా ద్వయం ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, అమిత్ షాల భేటీ జరిగి ఉండొచ్చు.ఆయన సేవలను దేశ వ్యాప్తంగా బీజేపీ ఉపయో గించుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సినిమాలు బాగున్నాయని అభినందించడానికి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని భావించడం లేదని… దీని వెనుక రాజకీయ కార ణాలు ఉన్నాయని అనుకుంటున్నాన’న్నారు.