ఫార్చ్యునర్ కారు అసలు ధర ఎంతో తెలుసా…?

ఫార్చ్యునర్ కారు అసలు ధర ఎంతో తెలుసా…?

మార్కెట్‌లో ఇప్పుడు ఫార్చ్యునర్‌ కారు ధర రూ.40 లక్షలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త సమాచారమేమీ కాదు. కానీ దాని అసలు ధర తెలుసుకుంటే మాత్రం అవాక్కవాల్సిందే. ఇంతకూ కారు అసలు ధర రూ.16 లక్షలు మాత్రమే. ఒక ఫార్చ్యునర్‌ కారును విక్రయిస్తే దాని ఉత్పత్తిదారుకు లభించేది కేవలం రూ.40 వేలు మాత్రమే. షోరూం నిర్వాహకులు…అంటే విక్రయదారులకు లభించేది. రూ.లక్ష. మిగిలినదంతా..అంటే సుమారు రూ.18 లక్షలకు పైబడి మనం మోదీ ప్రభుత్వానికి పన్నుగా చెల్లిస్తున్నాం. బహుశా ప్రపంచంలోనే ఇంత పెద్ద మొత్తంలో పన్ను మరెక్కడా ఉండదేమో. రూ.4 లక్షలు విలువ చేసే స్విఫ్ట్‌ కారుకు మనం మరో రూ.4 లక్షలు పన్ను రూపంలో చెల్లిస్తున్నాం. ఇలాంటి దోపిడీ ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు…పెట్రోలు లీటరు ధర రూ.32 అయితే మనం చెల్లిస్తున్నది రూ.115 పైమాటే. అయితే దేశ భక్తి ముందు ఈ డబ్బులు ఒక లెక్క కాదనుకోండి.

విషాదమేమిటంటే…మనం చెల్లిస్తున్న పన్నులన్నిటినీ ఆదానీ, అంబానీలు రుణాల రూపంలో తీసుకుని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ బిజినెస్‌మెన్‌గా ఎదిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకరిస్తూనే ఉంటుంది. అయితే దేశభక్తులైన మనం ఇవన్నిటినీ ఎందుకు పట్టించుకుంటాం? ఏ మసీదు అడుగు భాగంలో దేవతా విగ్రహాలున్నాయి? ఏ అంగడిలో హలాల్‌ కట్‌ చేస్తున్నారు? ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు లాంటి విషయాలపైనే మనమంతా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ఒకటి మాత్రం నిజం. శ్రీలంక చిన్న దేశం. ఇప్పుడు మునిగినా రేపు లేచి నిలబడగలదు. మనది 135 కోట్ల జనాభా కలిగిన దేశం. ఒకసారి అలాంటి పరిస్థితి ఎదురైతే…నిబాయించుకోవడానికి దశాబ్దాలు పడుతుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos