అమరావతి: కర్నూలులో ఉన్నత న్యాయస్థానం లేక ధర్మాసనం ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన ప్రకటించనున్నారని తెలిసింది. అధికార వికేంద్రీకరణ 13 జిల్లాలకూ విస్తరించాలని జగన్ భావిస్తున్నారు. విశాఖలోనూ ఉన్నత న్యాయస్థానం ధర్మాసనాన్ని ఏర్పాటు చేయదలచినట్లు అనధికార వర్గాల కథనం. సీమలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దరిమిలా కర్నూలు ధర్మాసనాన్ని మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు. అది అమలు కాలేదు.