సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు తగదు

సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు తగదు

న్యూ ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ నియంత్రణ వివాదాలకు దారి తీస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సామాజిక మాధ్యమాలపై నియంత్రణలు కూడదన్నారు. అత్యంత అరుదైన కేసులను మాత్రమే కోర్టు ధిక్కార నేరాలుగా సుప్రీంకోర్టు పరిగణించాలని కోరారు. ఒక పరిధిని దాటకుండా చేసే వ్యాఖ్యలు, విమర్శల గురంచీ సుప్రీం కోర్టు కూడా స్పందించకుండా ఉంటుందన్నారు. ఇండియాలో బహిరంగ ప్రజాస్వామ్యం ఉన్నందున ఎవరైనా,ఏదైనా చర్చించే స్వేచ్ఛను కలిగివు న్నారని వివరించారు. ఈ స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం చర్యల్ని తీసుకోరాదని సూచించారు. చాలా అరుదుగా మాత్రమే కొన్ని వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయ స్థానం కల్పించుకుంటుందన్నారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని తనకు ఎన్నో సూచనలు వచ్చాయన్నారు. వాటిల్లో కార్టూనిస్ట్ కునాల్ కమ్రాపై మాత్రమే ఆరోపణలను నమోదు చేశామని వేణుగోపాల్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos