
పాట్న:భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున స్వరాష్ట్రం బిహార్లోని బెగుసరై లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, విద్యార్థి నేత కన్హయ్యకుమార్ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను ఢీ కొట్టనున్నారు. ‘ఓట్లు సంపాదించే క్రమంలో నాయకులు అడ్డదారులు తొక్కారు. ప్రజమ్యాన్ని అవినీతి మయం చేశారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. రాజ్యంగ విలువలకు రక్షణ కల్పించే పోరాటంలో ప్రజలు భాగస్వామ్యమవ్వాలి. అందరూ కలిసి ఉద్యమించాలి’ అని క్రౌడ్ ఫండింగ్ ప్రారంభోత్సవంలో అన్నారు. చిన్న, చిన్న మొత్తాలను ఎక్కువ మంది నుంచి వసూలు చేసి ప్రచారానికి వినియోగించదలచారు.